![]() |
![]() |

నవంబర్ 4 నా తెలుగులో మూడు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్, ఊర్వశివో-రాక్షసివో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రయిబ్. ఇక ఈ మూవీస్ ప్రొమోషన్స్ కూడా అంతే జోరుగా హుషారుగా సాగుతున్నాయి. ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రయిబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా, సప్తగిరి ఇద్దరూ టేస్టీ తేజ కిచెన్ వివాహ భోజనంబుకి వచ్చారు. ఇక తేజ ఫరియాని పొగడ్తలతో ముంచెత్తాడు. "ఇండియాలో ఇన్కమ్ టాక్స్ లాగా బ్యూటీ టాక్స్ ఉంటే గనక అందరికంటే ఎక్కువ టాక్స్ మీరే కడతారు అని జోక్ చెప్పి మరీ కళ్ళు మూసుకుని సిగ్గుపడిపోయాడు" తేజ.
ఇక తేజ సప్తగిరిని అసలు పేరేమిటి .. అసలు సప్తగిరిగా ఎందుకు మారాల్సి వచ్చింది అని అడిగాడు.."తన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్ అని చెప్పాడు. ఐతే ఒకరోజు తిరుమలకి దైవదర్శనం కోసం వెళ్లాను. స్వామి వారి దర్శనం అయ్యాక బయటికొచ్చి గుడిని చూస్తూ ఉండగా మఠ పీఠాధిపతులు కొందరు అక్కడ తిరుమాడ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. నేను వాళ్ళను అస్సలు గమనించలేదు. ఇంతలో వాళ్ళ దారికి అడ్డుగా ఉన్న నన్ను ఒక పీఠాధిపతి వచ్చి నాన్న సప్తగిరి పక్కకు జరుగు అన్నారు. అలా పక్కకు జరిగాక వాళ్లంతా వెళ్తూ వెళ్తూ చిన్న చిరునవ్వు నవ్వారు. తర్వాత ఆ పేరే నాకు మళ్ళీ మళ్ళీ రీసౌండ్ లో వినిపించింది. ఇక అప్పుడు ఎందుకో మైండ్ లో అనిపించింది..అందుకే అప్పటినుంచి నా అసలు పేరును పక్కన పెట్టి ఇలా సప్తగిరిగా మారాను" అని చెప్పాడు.
![]() |
![]() |